ప్రపంచవ్యాప్తంగా మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలను త్వరితగతిన గుర్తించి వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స అందించవచ్చు. బతికే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే చాలామంది నిర్లక్ష్యంగా ఉండటంతో వారి చావును వారే కొని తెచ్చుకుంటున్నారు. ఈ వ్యాధితో చనిపోయే వారి సంఖ్య పెరుగుతండటంతో ప్రతి ఏటా మే నెలలో మూత్రాశయ క్యాన్సర్ అవగాహన నెలగా ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు.
ఈ సర్వసాధారణమైన వ్యాధితో ప్రభావితమైన రోగులు, ప్రాణాలతో బయటపడినవారితో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మూత్రాశయ క్యాన్సర్‌కు ధూమపానం చాలా ముఖ్యమైన కారణం. ఏ రూపంలోనైనా పొగాకు వినియోగం క్యాన్సర్‌కు బాటలు వేస్తుంది. ప్లాస్టిక్, రబ్బరు, తోలు మరియు పెయింట్ పరిశ్రమలలో ఉపయోగించే కొన్ని రసాయనాలకు గురికావడం కూడా మూత్రాశయ క్యాన్సర్‌కు కారణం.
మూత్రంలో రక్తం లేదా రక్తం గడ్డలు పడడం,యూరిన్ చేసేటప్పుడు నొప్పి లేదా మంట కలగడం. ఇది ప్రమాద సంకేతం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.ఇక రాత్రి పూట తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం కూడా ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటి.
Also Read:IPL 2023:ఆర్సీబీతో లక్నో ఢీ.. పరుగుల వరద ఖాయమేనా?
కుటుంబ చరిత్ర మరియు శారీరక పరీక్షల తర్వాత వ్యాధిని నిర్ధారిస్తారు. Hematuria ని నిర్దారించడానికి మూత్ర పరీక్ష (CUE).ప్రాణాంతక cytology కోసం మూత్ర పరీక్ష, మూత్రంలో క్యాన్సర్ కణాలను గుర్తించడానికి ఉదరం మరియు కటి యొక్క Ultrasound ,మూత్రపిండాల పనితీరు పరీక్షలు,ఉదరం మరియు కటి యొక్క CT Scan.Cystoscopy: మూత్రాశయం యొక్క endoscopic పరీక్ష ద్వారా నిర్దారిస్తారు.
Also Read:హ్యాపీ బర్త్ డే… అజిత్