సత్తా చాటింది..ఫైనల్‌కు చేరింది

182
World Badminton Championships: PV Sindhu beats Chen ...
- Advertisement -

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భాగంగా గ్లాస్గోలో జరుగుతున్న పోటీల్లో రియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు.. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఫైనల్‌కు చేరింది.

చైనా గోడను బద్దలు కొట్టిన సింధు.. తొలిసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌ చేరి కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్స్‌లో సింధు 21-13, 21-10తో 9వ సీడ్‌ చెన్‌ యూఫీ (చైనా)పై నెగ్గింది.

 World Badminton Championships: PV Sindhu beats Chen ...

తొలి గేమ్‌ ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. 8-8తో స్కోరు సమమైన సమయంలో సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి 11-8తో బ్రేక్‌కు వెళ్లింది. తర్వాత కూడా జోరును ప్రదర్శించి 21-13తో తొలి గేమ్‌ను నెగ్గింది. ఇక రెండో గేమ్‌ ఆరంభం నుంచే విరుచుకుపడిన సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 21-10తో గెలిచింది.

- Advertisement -