పోలీసులకు చుక్కలు చూపించిన అమ్మాయిలు..

64
Delhi traffic Police
- Advertisement -

ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు పట్ల ఇద్దరు అమ్మాయిలు, ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించారు. ఖాకీల చొక్కాలు పట్టుకుని ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారు. ఒకానొక సమయంలో పోలీసులపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు.ఆ సమయంలో అక్కడున్న ఉన్నతాధికారులు వారిని అడ్డుకున్నారు. ఎంతనచ్చజెప్పినా వారిని నిలువరించడం సాధ్యం కాలేదు.

అయితే మరి ఈ ఖాకీలు చేసిన తప్పు ఏందంటే.. రాంగ్ రూట్ లో బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇక అంతే వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎందుకు బైక్ ఆపారంటూ ఇద్దరు యువతులు పోలీసులపై అనుచితంగా ప్రవర్తించారు. వారికి మరో వ్యక్తి కూడా సపోర్ట్ చేస్తూ ఖాకీలు చొక్కాలు పట్టుకుని కొంతదూరం లాక్కెళ్లారు. అక్కడే ఉన్న కొందరు అధికారులు వారికి సర్దిజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినిపించుకోలేదు. వీరు ముగ్గురు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ కు ముందు భాగంలో నంబర్ ప్లేట్ కూడా లేదు.

ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించడమే కాకుండా పోలీసుల పట్ల వారు ప్రవర్తించిన తీరుపై అక్కడున్న వారందరూ విస్తుపోయారు. ఈ ఘటనలో ఓ పోలీస్కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -