మీరు ఏదైనా అత్యవసర పరిస్ధితుత్లో ఉన్నారా? ఎలాంటి సందర్భాల్లో అయినా ఒత్తిడిగా ఫిలవుతున్నారా? ముఖ్యంగా మహిళలను ఎవరయినా ఇబ్బంది పెడుతున్నారా? వీటన్నింటికి చెక్ పెట్టి ఓ యాప్ ను తయారు చేశాయి భారతీ ఎయిర్‌టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సంస్ధలు. మై సర్కిల్ పేరుతో ఈ యాప్ ను రూపొందించారు. ఓంటరిగా ఎక్కడికయనా వెళ్తున్న మహిళలకు ఈయాప్ ఉపయోగపడుతుంది. కేవలం ఎయిర్ టెల్ యూజర్లే కాకుండా అన్ని టెలికాం యూజర్లు ఆ యాప్ ను వినియోగించుకోచ్చు..
ఈ యాప్ తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషలతో సహా ఇంకా 13భాషల్లో రూపొందించారు. ఈయాప్ ద్వారా మీరు ఏదైనా ఇబ్బంది ఎదురయినపుడు మి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరికయినా ఐదుగురికి ఎస్ఓఎస్ అలర్ట్స్ ను పంపించవచ్చు.. తాము అత్యవసర పరిస్ధితుల్లో ఉన్నామని, తమను తామను చేరుకోవాలని సందేశాన్ని పంపొచ్చని ఈ యాప్ తెలుపుతుంది. గూగుల్ ప్లేస్టోర్, యూపిల్ ఐవోఎస్ స్టోర్ ఈయాప్ అందుబాటులో ఉంది.