తెలిసిన వాళ్లని వెళ్తే.. మద్యం తాగించి మహిళపై అత్యాచారం

157
Crime_against_women

హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి ఆపై ఆమెపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు కొందరు వ్యక్తులు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటకు చెందిన ఓ మహిళ(32) కు ఐదేళ్ల కిందట వివాహమైంది. అయితే వ్యక్తి గత కారణాల వల్ల ఆమె తన భర్తకు రెండు సంవత్సరాల కిందటే విడాకులు ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్న ఆమెకు మన్సూరాబాద్‌కు చెందిన మనోజ్‌కుమార్ ‌(30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

మనోజ్ వనస్థలిపురంలోని మ్యాక్స్‌లైఫ్ పాలసీ సంస్థలో పనిచేస్తున్నాడు. మనోజ్ కు ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అయితే శనివారం మనోజ్ ఆమెకు ఫోన్ చేసి ఒక విషయమై మాట్లాడాలి తను చెప్పిన అడ్రస్ కు రావాలని చెప్పాడు. తెలిసిన వ్యక్తే కదా అని అతను చెప్పిన అడ్రస్ కు వెళ్లింది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న మనోజ్ ఆమెకు బలవంతంగా మద్యం తాగిపించి.. స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తు కారణంగా సదరు మహిళా స్పృహ కోల్పోయారు. స్పృహలోకి వచ్చిన తరువాత తనకు జరిగిన అన్యాయంపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాదితురాలి ఫిర్యాదు మేరకు ఆ ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు వనస్థలిపురం సీఐ వెంకటయ్య .