నితిన్ సరసన ఛాన్స్ కొట్టేసిన అఖిల్ బ్యూటీ

173
Nithin-to-romance-Kalyani-P

యంగ్ హీరో నితిన్ చివరగా నటించిన మూడు సినిమాలు పరాజయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు ఈయంగ్ హీరో. ప్రస్తుతం ఆయన ఛలో దర్శకుడు వెంకీ కుడుములో సినిమా చేయనున్నాడు. ఈసినిమాకు భీష్మ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈసినిమాలో హీరోయిన్ గా రష్మీక మందనను తీసుకున్నారు. అయితే తాజాగా సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నట్లు తెలిపారు చిత్ర యూనిట్. కళ్యాణి ప్రియదర్శిన్ తెలుగులో మొదటగా అఖిల్ నటించిన హలో మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈచిత్రం సక్సెస్ సాధించకపోయిన కళ్యాణి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఈ అమ్మడు తాజాగా సాయి ధరమ్ తేజ్ సరసన చిత్రలహరి మూవీలో నటించింది. ఈసినిమా మంచి సక్సెస్ ను సాధించింది. అంతేకాకుండా బాక్సాఫిక్ వద్ద భారీ కలెక్షన్లను కూడా రాబడుతోంది. చిత్రలహరి సినిమా విజయం సాధించడంతో నితిన్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది కళ్యాణి ప్రియదర్శన్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈసినిమాతో నైనా హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.