కండ్లకలకతో బాధపడుతున్న కేటీఆర్..

157
ktr eye infection

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలను అంతే వేగంగా పరిష్కరిస్తారు. తాజాగా మరో పోస్ట్ చేశారు కేటీఆర్. ప్రతిసారి ప్రజల సమస్యలపై ట్వీట్ చేసే కేటీఆర్ తాజాగా ఆయన ఆరోగ్య విషయంపై ట్వీట్ చేశారు. తాను కండ్లకలకతో బాధపడుతున్నానని తెలిపారు. సోఫాలో కూర్చున్నట్టుగా ఉన్న తన ఫొటోను ట్వీట్‌లో అటాచ్‌ చేస్తూ.. కళ్లకలకతో ఎన్నోచూసే అవకాశం కలిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.

దీంతో నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విసృత స్ధాయి సమావేశానికి కేటీఆర్ గైర్హాజరయ్యారు. నిన్న ఉదయం ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హాజరయిన కేటీఆర్..అనంతరం కంటిలో నొప్పిగా అనిపించడంతో వైద్యుల వద్దకు వెళ్లారు. కేటీఆర్‌ను పరీక్షించిన వైద్యులు… కండ్ల కలక సోకిందని గుర్తించారు. దీంతో మూడు నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. ఇక తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసిన కేటీఆర్.. తన కండ్ల కలక గురించి వెల్లడించారు.