అల్ బకార పండ్లతో.. ఎన్ని లాభాలో !

64
- Advertisement -

చూడడానికి చిన్నగా, ఎర్రగా కనిపించే అల్ బకార పండ్ల గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇవి అన్నీ చోట్ల దొరికే పండ్లు కావు. సీజన్ నూ బట్టి కొన్ని ప్రాంతాల్లోనే సమృద్దిగా దొరుకుతాయి. అయితే రుచిలో కాస్త తీపి.. ఎక్కువ పులుపుతో కలిగి ఉండే అల్ బకార పండ్లు సకల పోషకలకు నిలయమని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. కాబట్టి మాన్ సూన్ సీజన్ లో దొరికే ఈ అల్ బకార పండ్లను తప్పక తినాలని చెబుతున్నారు న్యూట్రీషియన్స్.

ఈ పండ్లు శరీరంలోని పలు ఆరోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు, సమృద్దిగా పోషకాలను అందిస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి6, బి12 వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల జీర్ణ సమస్యలు దూరం అయి జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. ఇక ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు రక్త పోటునూ కంట్రోల్ చేసి గుండె జబ్బులు దరి చెరకుండా చూస్తాయి.

Also Read: ఇవి చేస్తే జిమ్ కు వెళ్లకుండానే.. ఫుల్ ఫిట్ !

అలాగే వివిధ రకాల క్యాన్సర్ కారకలపై పోరాడడంలో కూడా అల్ బకార పండ్లు ఎంతో ఉపయోగ పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ అనే కారకం.. రొమ్ము, జీర్ణాశయ, శ్వాసకోశ క్యాన్సర్ లకు కారణమయ్యే ఫ్రీరాడికల్ పై సమర్థవంతంగా పోరాడుతుంది. ఇక అల్ బకార పండ్లలో ఉండే విటమిన్ కె ఎముకల పాటుత్వాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే అల్జీమర్ వ్యాధిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ సీజన్ లో లభించే అల్ బకార పండ్లను కచ్చితంగా తినాలని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.

Also Read: బుల్లిఉల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

- Advertisement -