ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ

5
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ప్రధానికి స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తన మిత్రుడు ట్రంప్‌ ఫోన్‌ చేశారని ప్రధాని మోడీ ఎక్స్‌ (ట్వీట్‌) వేదికగా బుధవారం పోస్టు చేశారు.

ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టం. దృఢ సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ఆయన చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణ. ప్రజలు, దేశ శ్రేయస్సు పట్ల ఉన్న నిబద్ధత ఎందరో జీవితాలను ప్రభావితం చేసింది. అంకితభావంతో ఆయన మన ప్రపంచ స్థాయిని బలోపేతం చేశారు. ఆరోగ్యం, అపరిమిత శక్తితో మాతృభూమికి మోదీ మరింత సేవ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

ఇక మోదీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీ అద్భుతమైన ప్రయాణంలో, చిన్న స్థాయి నుండి నిరాడంబర ఆరంభాలతో మొదలై, అచంచలమైన క్రమశిక్షణ మరియు నిబద్ధతతో, మా మహాన దేశానికి మార్గదర్శక శక్తిగా అవతరించిన నాయకుడి కథను మేము చూస్తున్నాం అన్నారు.

మీ భారత దృష్టి కేవలం పాలన గురించే కాదు, అది దేశ ఆత్మను మేల్కొలపడం గురించీ ఉంది — ప్రజలలో స్వీయ విశ్వాసం, గౌరవం, ఐక్యతను నింపడం గురించీ ఉంది. మా సంస్కృతి, వారసత్వం, జాతీయ స్వరూపంపై గర్వించమని ప్రతి పౌరుడిని మీరు ప్రేరేపించిన విధానం, భారత ఆత్మను మరింత బలపరిచింది. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో మీ నిరంతర కృషి, పేదలు మరియు అణగారిన వారిపట్ల మీ కరుణ, భారతాన్ని అభివృద్ధి దిశగా నడిపించే మీ ధృఢ సంకల్పం — ఇవన్నీ మీ నాయకత్వానికి చిరస్మరణీయమైన ముద్రలుగా నిలిచిపోతాయి. వికసిత్ భారత్ — 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతం అనే మీ సంకల్పం ప్రతి భారతీయుడిని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తోంది.

ప్రజలతో లోతుగా అనుబంధం కలిగిన వ్యక్తిగా, ప్రజా జీవితంలో వచ్చే బాధ్యతా భారాన్ని, త్యాగాలను నేను అర్థం చేసుకోగలను. విశ్రాంతి లేకుండా పగలు-రాత్రులు పనిచేస్తూ, దేశం నలుమూలల పర్యటిస్తూ, ప్రపంచ వేదికపై భారతాన్ని గర్వంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ అహర్నిశ కృషి ఎల్లప్పుడూ నాకు ప్రేరణ. మీ జీవితం సంకల్పం, నిష్కళంకత, ఆధ్యాత్మిక శక్తి ఎలా ఒక వ్యక్తినే కాకుండా, మొత్తం దేశాన్నీ మార్చగలవో చూపించే సజీవ సాక్ష్యం అన్నారు పవన్.

Also Read:‘తెలుసు కదా’..షూటింగ్ పూర్తి

- Advertisement -