తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది

5
- Advertisement -

హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది అన్నారు. ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నాం…. మేము అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం అన్నారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు రేవంత్.

మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులను చేయబోతున్నాం అన్నారు. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తాం….స్వేచ్చ, సమానత్వంలో తెలంగాణ రోల్‌ మోడల్‌గా ఉంది అన్నారు. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు అందుకోవడానికి విద్య ఒక్కటే మార్గం. భవిష్యత్‌ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నాం అన్నారు.

Also Read:KTR:సెప్టెంబర్ 17..జాతీయ సమైక్యత దినోత్సవం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం అని…. ఆ బిల్లులకు చట్టబద్దత కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం అన్నారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు… మన వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం అని తేల్చిచెప్పారు రేవంత్. సెప్టెంబర్ 17 ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన రోజు అన్నారు.

- Advertisement -