చలికాలంలో వేరుశనగ తింటే మంచిదేనా!

35
- Advertisement -

రోజురోజుకు చలి పెరుగుతోంది. ఎక్కడ చూసిన మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా చలికాలంలో ఎక్కువమంది జబ్బుల బారిన పడుతుంటారు. కాబట్టి తినే ఆహారం మొదలుకుని వ్యక్తిగత పరిశుభ్రత వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు నిపుణులు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో ఏవి పడితే అవి తినడం ఏమాత్రం మంచిది కాదు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు చలికాలంలో తినడం ఎంతో మంచిది. అలాంటి వాటిలో వేరుశనగ కూడా ఒకటి. వేరుశనగ ను శాఖాహారుల బలవర్థకమైన ఆహారంగా పరిగణిస్తుంటారు ఆహార నిపుణులు. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. .

వేరుశనగలో పొటాషియం, కాపర్, కాల్షియం, ఐరన్, జింక్, సెలీనియం వంటి మూలకాలతో పాటు ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. చలికాలంలో చాలమందికి కండరాల నొప్పి, ఎముకల నొప్పి వేధిస్తుంటుంది. అలాంటి వారు గుప్పెడు వేరుశనగ తింటే ఎంతో మేలు. ఎందుకంటే ఇందులో ఉండే కాల్షియం, ఎముకలను బలపరుస్తుంది. ఇంకా ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా చలికాలంలో తరచూ వేధించే ఆరోగ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇంకా చలి కాలంలో చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వేరుశనగ లో ఉండే మోనో అన్శాచురేటెడ్, పాలీ అన్శాచురేటెడ్ ఆమ్లాలు చర్మం పొడిబారకుండా చేస్తూ చర్మ సంరక్షణకు దోహదం చేస్తాయి. కాబట్టి చలికాలంలో వేరుశనగ తినడం మంచిదేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఓ గుప్పెడు వేరు శనగలు తినడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందట.

Also Read:కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు!

- Advertisement -