- Advertisement -
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన వింగ్స్ ఇండియా 2020 ప్రదర్శనలో సారంగీ టీమ్ ఆధ్వర్యంలో హెలికాప్టర్స్ తో ఎయిర్ షో నిర్వహించారు. ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ జేఫ్రీ ఆధ్వర్యంలో జేట్ ఫ్లైట్ ఎయిర్ షో ప్రదర్శన నిర్వహించారు. రెండేండ్లకోసారి నిర్వహించే వింగ్స్ ఇండియా ఎయిర్‌షో గురువారం నుంచి నాలుగురోజులపాటు ఈ ప్రదర్శన జరుగుతుంది.
పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇం డియా-2020 ప్రదర్శనను 13వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. పౌరవిమానయాన రంగంలో చేసిన సేవలకుగాను వివిధ సంస్థలు, వ్యక్తులకు అదేరోజు రాత్రి తాజ్‌కృష్ణ హోటల్‌లో అవార్డులు అందజేయనున్నారు.
- Advertisement -