పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా..సెమీస్‌ ఆశలు ఖతం

332
nz vs sa
- Advertisement -

వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా నాకౌట్‌ ఆశలు అడుగంటాయి. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగో పరాజయం చవిచూసిన సఫారీలు ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. క్లిష్టపరిస్థితుల్లో కెప్టెన్‌ విలియమ్సన్‌ అద్భుతంగా పోరాడిన వేళ న్యూజిలాండ్‌.. నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది.

వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించగా మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 241 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 48.3 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విలియమ్సన్‌ (106 నాటౌట్‌; 138 బంతుల్లో 9×4, 1×6), గ్రాండ్‌హోమ్‌ (60; 47 బంతుల్లో 5×4, 2×6) వీరోచిత పోరాటంతో జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ డికాక్‌ (5),డుప్లెసిస్‌ (23),మార్‌క్రమ్‌ (38), డసెన్‌ (67 నాటౌట్‌; 64 బంతుల్లో 2×4, 3×6), ఆమ్లా (55; 83 బంతుల్లో 4×4) రాణించడంతో దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 241 పరుగులు చేసింది.

- Advertisement -