దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. చైతన్యవంతమైన గడ్డ కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు నాయకులు కాదు. ఇండియాలో మెచ్చురిటీ రావాలి. ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల పెద్దలు వచ్చి ప్రచారం చేశారు. అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చారు.
మమతా బెనర్జీ, సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా దేశంలో ఓ అనిశ్చితి ఉంది.. ఇది మారాలి. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చాం. తమకు ప్రజలే బాస్‌లు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తానని చెప్పారు.