రేపు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ..

192
TRSLP meeting
- Advertisement -

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 87 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11:30 గంటలకు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులందరూ హాజరై టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. 119 స్థానాలకు గానూ 87 స్థానాల్లో విజయం సాధించడంతో.. టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.

- Advertisement -