పవన్ ” శపథం ” నెరవేరుతుందా.. ?

50
- Advertisement -

ఏపీ రాజకీయాలు మూడు ప్రధాన పార్టీల మధ్య రసవత్తరంగా మారుతున్నాయి. ఆ ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది వ్యూహప్రతివ్యూహాలతో పార్టీ అధినేతలు సిద్దమౌతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ జనసేన పార్టీకి సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న పవన్.. ఎలాగైనా కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉంచితే ఉభయగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కనివ్వనని పవన్ ఇటీవల శపథం చేశారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది.

తూ.గో.జి లో 19 సీట్లకు గాను 14 సీట్లు, ప.గో.జి లో 15 సీట్లకు గాను 13 సీట్లు కైవసం చేసుకొని వైసీపీకి ఎదురెలేదనే విధంగా విజయఢంఖా మోగించింది. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం కూడా గట్టిగానే ఉంది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఒకే ఒక్క సీటు కూడా ఈ గోదావరి జిల్లాలోనిదే. సీటు ఒక్కటే గెలిచినప్పటికి ఓటు శాతం మాత్రం గట్టిగానే సంపాదించింది జనసేన. కానీ అప్పుడు వ్యతిరేక ఓటు చీలిక కారణంగా జనసేన ఓటు బ్యాంకు కాస్త వైసీపీకి ప్లస్ అయింది.

Also Read: Paris:మానవహక్కుల ఉల్లంఘన ..ఆఫ్రికన్‌ బాయ్‌ని చంపిన పోలీసులు..!

ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఉభయ గోదావరి జిల్లాల్లో చెక్ పెట్టాలని పవన్ గట్టి ప్రణాళికతోనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ అసంతృప్త నేతలను జనసేనలోకి లాక్కునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఉభయగోదావరి జిల్లాలోని మరికొంతమంది వైసీపీ నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారట. దీంతో పవన్ వైసీపీకి చెక్ పెట్టేందుకు పక్కాగా ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కనివ్వనని శపథం చేసిన పవన్ ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: DevendraFadnavis:సుశాంత్ మర్డర్‌పై కీలక ఆధారాలు..

- Advertisement -