మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. దాంతో చరణ్ తరువాతి సినిమా కోసం ప్రపంచ సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చెర్రీ శంకర్ దర్శకత్వంలో ” గేమ్ ఛేంజర్ ” మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికి.. సినిమాకు సంబంధించి ఇంతవరకు ఫస్ట్ లుక్ టైటిల్ తప్పా ఇంకా వేరే అప్డేట్స్ ఏవి ఇవ్వలేదు చిత్రయూనిట్. షూటింగ్ టైమ్ లో లీక్ అయిన చరణ్ ఫిక్స్ తప్పా. ఇంతవరకు అభిమానులను కట్టి పడేసే ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు చిత్ర బృందం దాంతో మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది ? సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తారా లేదా ? అనే డౌట్ మెగా అభిమానులను గట్టిగానే వెంటాడుతోంది..
అన్నీ అనుకున్నట్లు జరిగితే మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారనే టాక్ నడిచింది. కానీ మధ్యలో శంకర్ ” గేమ్ ఛేంజర్ ” మూవీకి బ్రేక్ ఇచ్చి ” భారతీయుడు 2 ” మూవీ పై ఫోకస్ చేయడంతో చరణ్ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో సంక్రాంతి నుంచి కాస్త సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే సమ్మర్ కు కూడా ఈ మూవీ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయట.
Also Read: పిక్ టాక్ : పరువాల వరద పారించింది
ఎందుకంటే ఈ ఏడాది దీపావళికి ” ఇండియన్ 2 ” మూవీ రిలీజ్ ఉండడంతో శంకర్ పూర్తి ఫోకస్ అంతా ఆ సినిమాపైనే ఉంచాడట. దాంతో చరణ్ మూవీకి సంబంధించి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. కనీసం అభిమానుల కోసం టీజర్, పోస్టర్ వంటివి కూడా చిత్రయూనిట్ ప్లాన్ చేయకపోవడంతో అసలు ఈ మూవీ ఎప్పుడు వస్తుందో అనే అనుమానాలు మెగా అభిమానులను గట్టిగానే వెంటాడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు లీక్ అయిన పోస్టర్స్ ను బట్టి చూస్తే ఈ మూవీలో చరణ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తాడని టాక్. మరి తన క్రియేటివిటీ తో వండర్స్ క్రియేట్ చేసే శంకర్.. గేమ్ ఛేంజర్ మూవీతో చరణ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.
Also Read: సురేఖా వాణిని ఇబ్బంది పెడుతున్నారు

