సీఎం కేసీఆర్ నా గాడ్‌ఫాదర్.. పార్టీని వీడేదిలేదు..

304
shakeel

నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ బీజేపీలో చేరబోతున్నారంటూ గురువారం వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో, తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన చర్యల పట్ల వివరణ ఇచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌తోనే నా జీవితం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆరే నా గాడ్‌ఫాదర్ అని షకీల్‌అహ్మద్ స్పష్టంచేశారు.

kcr

సీఎం కేసీఆర్ నాకు మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించారు. ఆయన ఆశీర్వాదంతోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కేసీఆర్ పిలుపుతోనే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను.నాకు రాజకీయ భిక్షపెట్టింది కేసీఆరే. సీఎం కేసీఆర్ మాటే నాకు వేదవాక్కు. ఎట్టిపరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను వీడేదిలేదు. జీవితమంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. బతికినంతకాలం టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతాను.

Shakeel Ahmed

మంత్రిపదవి కావాలని సీఎంను ఎప్పుడూ అడుగలేదు అని తెలిపారు. బీజేపీలో లేదా కాంగ్రెస్‌లో చేరుతానని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఓ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే బీజేపీ ఎంపీ అరవింద్‌ను కలిశానని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం అరవింద్‌ను కలిశానని షకీల్ వివరణ ఇచ్చారు.