మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధర..!

666
Petrol Price
- Advertisement -

దేశం వ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. పెట్రోల్ ధర 7 పైసలు, డీజిల్ ధర 9 పైసలు పెరిగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 77.57రూపాయలు, డీజిల్ 68.46రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 71.89రూపాయలుగానూ, డీజిల్ ధర 65.28రూపాయలుగానూ ఉంది.

Petrol Price

దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంధనం ధరలు భగ్గుమన్నాయి. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.42కు చేరింది. డీజిల్ ధర రూ.71.16కు ఎగసింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.76.03 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్‌ ధర కూడా రూ.70.42 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.75.66 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. దీంతో ధర రూ.70.08 వద్దనే ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం తాగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 60.25 డాలర్లు (0.22 శాతం తగ్గుదల) గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 54.98 డాలర్లు (0.20 శాతం తగ్గుదల) గానూ ఉన్నాయి.

- Advertisement -