కేజ్రీవాల్ అరెస్ట్.. వ్యూహమా ?నేరమా?

35
- Advertisement -

దేశ వ్యాప్తంగా కుదిపేస్తున్న డిల్లీ లిక్కర్ స్కామ్ లో డిల్లీ సి‌ఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఎన్నో మార్లు ఈ కేసులో భాగంగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేస్తూనే వచ్చింది. అయితే కేసు కోర్టు పరిధిలో ఉందని విచారణకు హాజరు కాకుండా జాప్యం చేశారు కేజ్రీవాల్. అయితే ఈడీ సమన్లుపై తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం ఇటీవల తేల్చి చెప్పడంతో నాటకీయ పరిణామాల మద్య కేజ్రీవాల్ ను నిన్న( మార్చి 21) ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఈ పరిణామం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా మాజీ డిప్యూటీ సి‌ఎం మనిష్ సిసోడియాతో పాటు మరికొంత మందిని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. .

ఇక ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్టు కావడంతో సార్వత్రిక ఎన్నికల ముందు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. గత కొన్నాళ్లుగా తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, దర్యాప్తు సంస్థలు మోడి చేతిలో కీలు బొమ్మలుగా మారాయని కేజ్రీవాల్ ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు కేజ్రీవాల్ అరెస్టును సస్పెన్స్ గా ఉంచుతూ వచ్చిన ఈడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత అరెస్టు చేయడంతో ఈ పరిణామం ఎన్నికల వ్యూహమే అనేది కొందరి అభిప్రాయం. డిల్లీలో అధికార పీఠం దక్కించుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

అక్కడ ఆమ్ ఆద్మీ ప్రభంజనం కొనసాగుతుండడంతో ఎన్నిక ఏదైనా బీజేపీకి నిరాశే ఎదురవుతూ వచ్చింది. దాంతో ఈసారి ఆప్ కు చెక్ పెట్టేందుకు లిక్కర్ స్కామ్ ను తెరపైకి తెచ్చి బీజేపీ గట్టి దెబ్బ తీసిందనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే లిక్కర్ స్కామ్ లో నిజంగానే వేల కోట్ల అవినీతి జరిగిందని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ( ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ) ఆధారాలతో సహ ఆరోపిస్తోంది. దీంతో ఆర్థిక నేరం కారణంగానే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడనేది మరికొంద్సరి అభిప్రాయం. మొత్తానికి ఎన్నికల ముందు సి‌ఎం కేజ్రీవాల్ అరెస్టు కావడం దేశ రాజకీయాలను కుదిపేసే అంశమే.

Also Read:56 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్..

- Advertisement -