దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిథ కథ ఆధారంగా ‘యాత్ర’ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో వైఎస్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్ తనయుడు జగన్ పాత్రలో తమిళ్ హీరో సూర్య నటించనున్నారని ప్రచారం జరగింది. అయితే చిత్ర యూనిట్ ఆయనను సంద్రదించగా బీజీ షెడ్యూల్ వలన చేయలేనని.. తన తమ్ముడు కార్తి అయితే జగన్ పాత్రకు కరెక్టు సెట్ అవుతాడని నిర్మాతలకు సూచిండాడట.
సూర్య బిజీగా ఉండడంతో జగన్ పాత్రలో కార్తీ నటించనున్నాడని, చిత్ర యూనిట్ కూడా ఆయన పేరు ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తి ‘చిన్నబాబు’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రైతు సమస్యలపై తీసిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. తమిళంలో మాత్రం కార్తీకి మంచి పేరు తీసుకువచ్చింది. జగన్ పాత్రలో కార్తి చేస్తే తెలుగులో ఆయనకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.