వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయని అన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో రూ.3,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నామని, జోజిలా పాస్ టన్నెల్ వంటి క్లిష్టమైన నిర్మాణాలను చేపట్టామని అన్నారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని గడ్కరీ తెలిపారు. అదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది..అందుకే ఎక్కువసార్లు ఇక్కడికి రావడానికి ఇష్టపడతానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు విస్తరిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా ప్రజలు భావిస్తారని అన్నారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి, నాగ్ పూర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణం చేపట్టామని, తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టవిటీ మరింత పెరగనుందని చెప్పారు.
Also Read:HIT 3:వంద కోట్ల క్లబ్లో హిట్3!

