కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్ష ఏన్నికలు ఇప్పట్లో లేనట్టే కనపడుతున్నవి. వరసగా ప్రస్తుత ఆధినేత్రికి అనారోగ్య సమస్యలు వల్ల ఏన్నికలు జరగడం లేదని జాతీయ మీడియా కథనాలు వెల్లువడుతున్నాయి. వైద్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. తర్వాత ఇటలీ వెళ్తారు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శంచనున్నారు. ఈ మొత్తం పర్యటనలో సోనియా వెంట రాహుల్, ప్రియాంక వాద్రా ఉంటారు. దాంతో పార్టీ కార్యకలాపాలు, ఎన్నిక గురించి చర్చించేందుకు పార్టీ వర్కింగ్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. మరోవైపు దీపావళి తర్వాత అక్టోబర్ చివర్లో ఈ ఎన్నికను నిర్వహించాలని పార్టీ వర్గాల సమాచారం. వాస్తవంగా సెప్టెంబర్ 21కి హస్తం పార్టీకి అధ్యక్షుడు రావాల్సి ఉండగా…. ప్రస్తుతం ఆ డెడ్‌లైన్‌ను మరో నెల రోజులకు పొడగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్‌పై ఈ ఆదివారం సమావేశం జరగనుంది.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైన సంగతి తెలిసిందే. దానికి నైతిక బాధ్యతగా అప్పటి, ఇప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన పదవి నుంచి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాత్కలికంగా అధినేత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే రాహుల్ ఆ పదవికి సుముఖంగా లేరని పార్టీ వర్గాల సమాచారం. గాంధీయేతర వ్యక్తులకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని జీ 24 సభ్యులు నిర్ణయించారు. దీంతో తెరపైకి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లట్ పేరు వినిపిస్తోంది. కానీ ఆ వార్తలను ఆయన ఇదివరకే తోసిపుచ్చారు.