2022లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ చేస్తుందని తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మీడియాతో మాట్లాడిన కే్జ్రీవాల్…యుపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటుతామని వెల్లడించారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్ధానాలను గెలిచిన ఆప్…2019లో ఒకే స్ధానాన్ని దక్కించుకుంది. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ ఇన్సాఫ్ పార్టీతో కలిసి బరిలో దిగిన ఆప్ 20 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.
2012 నవంబర్ 26న ఆప్‌ని స్ధాపించగా 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయా, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థులను బరిలో దించినా ఒక్క స్థానంలో విజయం సాధించలేకపోయింది.