యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో విరాటపర్వం..

179
rana
- Advertisement -

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం విరాటప‌ర్వం . రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండగా రానా నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

రానా బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రానా .. ర‌విశంక‌ర్ అలియాన్ ర‌వ‌న్న అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. 1990లో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వ‌హిస్తున్నారు.

- Advertisement -