బండి సంజయ్‌..కొత్త బిచ్చగాడు:బాల్క సుమన్

58
suman

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారు.. అర్ధరహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే బాల్క సుమన్‌.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సుమన్…కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ను హెచ్చ‌రించారు.

రాజ్యాంగ బ‌ద్ధ వ్య‌వ‌స్థ‌ల‌పై సంజ‌య్ అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.ప్ర‌ధాన‌మంత్రిని సీఎంలు క‌ల‌వ‌డం సాధార‌ణ‌మ‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు అవ‌గాహ‌న పెంచుకొని మాట్లాడాల‌ని… లేని ప‌క్షంలో తెలంగాణ ప్ర‌జ‌లే బుద్ధి చెప్తార‌ని సుమ‌న్ తెలిపారు.

రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బ‌కాయిలు, రాష్ర్టానికి సంబంధించిన ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా వంటి అంశాల‌పై చ‌ర్చించార‌ని గుర్తు చేశారు.