బిగ్ బాస్ 4 ..వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీరేనా!

194
bigg boss 4
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4విజయవంతంగా నాలుగు ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. అయితే తొలివారంలో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఇంటి సభ్యులు విఫలం కావడంతో వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్‌లను హౌస్‌ లోపలికి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియకు గంగవ్వతో పాటు అభిజిత్, అఖిల్, మెహబూబ్, సుజాత, దివి, సూర్యకిరణ్‌లు నామినేట్ కావడం వీరిలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో వీరి స్ధానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు కంటెస్టెంట్స్‌ని పంపించబోతున్నారని టాక్‌.

జబర్దస్త్ అవినాష్ ,నటుడు సాయి కుమార్ పంపన ,స్వాతి దీక్షిత్ లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపించి ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేలా ఏర్పాట్లుచేయనున్నారు. అయితే వీరు ఫస్ట్ వీక్ నామినేషన్‌ తర్వాత వెళ్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -