బిగ్ బాస్ తెలుగు 5…వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీరేనా.!

225
nag
- Advertisement -

బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ ప్రారంభంకానుండగా ఈసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు కింగ్ నాగార్జున. ఇప్పటికే ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం కానుండగా శని,ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్‌ క్వారంటైన్ పూర్తికాగా వీరికి సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేది వీరేనని ప్రచారం జరుగుతోంది. వందరోజులకు పైగా సాగే బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. హౌస్‌లో జోష్ పెంచాలన్న,షోను ఆసక్తికరంగా మార్చలన్న వీరి పాత్ర చాలా కీలకం. గత సీజన్‌లలో వైల్డ్ కార్డు ఎంట్రీ బాగావర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి కంటెస్టెంట్‌లనే ఎంపికచేశారట.

వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న వారిలో విశ్వ, ప్రియాంక రామ్, ఉమా దేవి, నటరాజ్ మాస్టర్, సరయూ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై నిర్వాహకులు అఫీషియల్‌గా అనౌన్స్ చేసేవరకు వేచిచూడాలి. ఇక బిగ్ హౌస్‌లోకి వెళ్లేవారిలో షణ్ముఖ జశ్వంత్, సిరి హన్మంత్,మోడల్ జశ్వంత్ కుమార్,యాంకర్ రవి,అనీ మాస్టర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -