భర్తపై కోపంతో కాలువలోకి దూకేసింది ఓ మహిళ. ఇంతకూ ఆమె అలకకు కారణమేంటో తెలుసా.. తనను సినిమాకు తీసుకువెళ్లక పోవడం. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వాంబే కాలనీకి చెందిన రాజారెడ్డికి ఇటీవల తిరుపతమ్మ అనే యువతితో వివాహమైంది.
ఆదివారం కావడంతో సినిమాకు వెళ్దామని తిరుపతమ్మ భర్తను కోరింది. అయితే రాజారెడ్డి ఇప్పుడొద్దని వారించాడు. దీంతో అలిగిన ఆమె సమీపంలోని కాలువలోకి దూకేసింది.
గమనించిన భర్త ఈత రాకపోయినా భార్యను రక్షించేందుకు తానూ కాలువలోకి దూకాడు. ఇరువురు కొట్టుకుపోతున్న సమయంలో సమీపంలోని ధర్మాచౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎపీఎస్పీ కానిస్టేబుళ్లు చూసి కాలువలోకి దూకి వారిని కాపాడారు.
ఆ తర్వాత వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. ఇక భార్యాభర్తలిద్దరినీ ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాసులును ఘనంగా సన్మానించారు. నదిలోకి దూకి ఎంతో కష్టపడి ఇద్దరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాసులుకు రివార్డు అందజేశామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు బీవీ రమణ తెలిపారు.