అధర్మపురి..ఓడిపోవడానికి రెడీనా!

157
mp aravind
- Advertisement -

పేరుకే జాతీయ పార్టీ..కానీ ప్రాంతానికో విధానం. ఇంకా చెప్పాలంటే ఎన్నికలుంటే చాలు. మాటల్లో మెట్రో వస్తది, ఐటీఐఆర్ వస్తది,ప్యాకేజీలు వస్తాయి, రైల్వే జోన్లు వస్తాయి….ఇంకా పసుపు బోర్డు వస్తది. ఇది బీజేపీ నేతల వైఖరీ. అవసరమైతే బాండ్ కూడా రాసిస్తారు..దానికి ఉదాహరణే తెలంగాణలో పసుపు బోర్డు పేరుతో గెలిచిన ఆ పార్టీ ఎంపీ.

అమ్మకు గాజులు కొనియలేదట పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట. నిజామాబాబ్‌కు పసుపు బోర్డు తేలేదు కానీ పక్క రాష్ట్రం తమిళనాడులో ఎన్నికలు అనగానే పసుపుబోర్డు గుర్తుకొచ్చిన ఈ బొడిగుండు ఒక్కమాట ఉలుకులేదు పలుకులేదు. అలాంటి వ్యక్తి నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌ను ఓడగొడతారట.

నవ్విపోదురుకాగ నాకేంటి సిగ్గు అంటే ఇదే. గురువింద గింజ తన నలుపు తాను ఎరుగదంటే ఇదే. తానిచ్చిన హామీలు గుర్తులేదు గానీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మాత్రం తెలుసు. ఇప్పుడు ఇదే అధర్మపురిపై ఇందూరు ప్రజల మనసులో మాట ఇదే. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన ఓటుతో బుద్దిచెప్పడం ఖాయం. ఇది తెలిసే అధర్మ ప్రేలాపనలు, అసంబద్ద మాటలు. అరవింద్ మాటలు విని నిజామాబాద్ ప్రజలే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఇందూరులో పోటీ చేయి..ఖచ్చితంగా బుద్దిచెప్పడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -