వాహనదారుల్లో ఇథనాల్ టెన్షన్!

2
- Advertisement -

దేశవ్యాప్తంగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకంపై వాహనదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల తగ్గింపు పేరుతో పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని వేగంగా పెంచుకుంటూ పోతోంది. అయితే సరైన ముందస్తు ప్రణాళికలు, ప్రత్యామ్నాయాలు లేకుండా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల లక్షలాది మంది సామాన్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ (20% ఇథనాల్, 80% పెట్రోల్) ను తప్పనిసరి చేసింది. దీనివల్ల తమ వాహనాల మైలేజ్ దారుణంగా పడిపోయిందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల వాహనాల మైలేజ్ సుమారు 5% నుండి 12% వరకు తగ్గుతోందని వాహనదారుల అనుభవాలు చెబుతున్నాయి. ఇథనాల్‌కు గాలిలోని తేమను లాక్కునే గుణం ఉంటుంది. దీనివల్ల ఇంధన ట్యాంకులు తుప్పు పట్టడం, పైపులు, గ్యాస్కెట్లు, రబ్బర్ సీల్స్ పాడైపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వాహనం కొన్ని రోజులు పక్కన పెడితే స్టార్టింగ్ సమస్యలు కూడా వస్తున్నాయని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:‘సింగ్ గీతం’పై ఎన్టీఆర్ ప్రశంసలు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న E20 పెట్రోల్‌తోనే వాహనదారులు సతమతమవుతుంటే, ప్రభుత్వం త్వరలోనే E22, E25, E27, E30 తో పాటు ఏకంగా 100% ఇథనాల్‌తో నడిచే E100 ఇంధనాన్ని కూడా తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. దీనిపై దేశ ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే E20తో మా బండ్లు దెబ్బతిన్నాయి. రేపు E30, E100 వస్తే మా కోట్లాది పాత వాహనాలను స్క్రాప్‌ కింద పడేయాలా?” అని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -