డీజిల్‌పై ఎగుమతి సుంకం పెంపు

2
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం సోమవారం డీజిల్ ఎగుమతులపై లీటరుకు 14 రూపాయలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF – విమాన ఇంధనం) ఎగుమతులపై లీటరుకు 12.5 రూపాయల చొప్పున ఎగుమతి సుంకాలను పెంచింది. అయితే పెట్రోల్ ఎగుమతి సుంకాల రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.

రెవెన్యూ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం.. డీజిల్ ఎగుమతులపై రూ. 14, ఏటీఎఫ్ ఎగుమతులపై రూ. 12.5 చొప్పున సుంకం విధించబడుతుంది. పెట్రోల్ ఎగుమతి సుంకాల రేట్లలో గానీ దేశీయ వినియోగం కోసం సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్‌లపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో గానీ ఎలాంటి మార్పు లేదు. ఈ సవరించిన రేట్లు నేటి నుండి అమలులోకి వచ్చాయి.

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో.. దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి మరియు ఎగుమతులను నిరుత్సాహపరచడానికి మార్చి 27 నుండి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED), రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ (RIC) వంటి ఎగుమతి పన్నులను కేంద్రం ప్రవేశపెట్టింది.

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (LPG), సహజ వాయువు (Natural Gas) సరఫరా సరిపడినంత ఉందని సోమవారం పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పౌరులు, పరిశ్రమలు ఇంధనాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కోరింది.

Also Read:‘సింగ్ గీతం’పై ఎన్టీఆర్ ప్రశంసలు

- Advertisement -