ఒమిక్రాన్ మరణాలు తక్కువే:డబ్ల్యూహెచ్‌వో

182
omicron
- Advertisement -

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ కలవర పెడుతోంది. ముఖ్యంగా అమెరికాలో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతుండగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒమిక్రాన్ ప్రభావం ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒమిక్రాన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య చాలా తక్కువని.. ఒమిక్రాన్‌ మరణాలు కూడా తక్కువేనని పేర్కొంది. 128 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని…ఒమిక్రాన్ సంక్రమించిన ఐదు నుండి ఏడు రోజులలోపు కోలుకుంటున్నారని తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కంటే ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే పేర్కొంది. అధిక-ప్రమాదకర వ్యక్తులు మరియు టీకాలు వేసుకోనివారు ఇప్పటికీ ఆ వేరియంట్ నుండి తీవ్ర అనారోగ్యానికి గురువుతున్నారని తెలిపింది.

- Advertisement -