సూపర్ మచ్చి ..లిరికల్ రిలీజ్‌..

46
super macchi

కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. రచిత రామ్ నాయికగా నటిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమా ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రమిది. గత దీపావళి పండక్కి విడుదల చేసిన సూపర్ మచ్చి సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి పండక్కి రిలీజయ్యే సినిమాల్లో ఉండాల్సిన కంటెంట్, ఎలిమెంట్స్‌తో సూపర్ మచ్చిని తెరకెక్కించారు దర్శకుడు పులి వాసు. పండగ వాతావరణానికి సరిగ్గా సరిపోయే చిత్రమిది. న్యూ ఇయర్‌కు రిలీజ్ చేసిన సినిమా స్టిల్ కూడా హీరో హీరోయిన్స్ స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. రచితా రామ్ కళ్యాణ్ దేవ్‌కు మంచి జోడీగా కుదిరింది.

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్న సూపర్ మచ్చి చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ చేస్తున్నారు. ఇలా టెక్నికల్ అంశాల్లోనూ సూపర్ మచ్చి చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది.

Dinchaku Dinchaku Lyrical| Super Machi Songs |Kalyaan Dhev, Rachita Ram|Puli Vasu |Thaman S |Rizwan