ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి:ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో

156
who
- Advertisement -

ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకుని కోవిడ్‌ బారినపడి కోలుకున్న వ్యక్తులైన వారికి సైతం ఈ ఒమిక్రాన్‌ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్థిరమైన ఆధారాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతమవుతున్న వేళ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరోసారి యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

- Advertisement -