Congress:మీలో ఎవరు ‘సి‌ఎం’!

67
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. రేపు విడుదల అయ్యే ఫలితాలతో ఐదేండ్ల పాలన ఎవరి చేతిలో ఉండనుందో తేలిపోనుంది. కాగా ఈ ఈసారి కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తెలపడంతో ఆ పార్టీ వైపు అందరి దృష్టి నెలకొంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు సి‌ఎం అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత కొన్నాళ్లుగా ఆ పార్టీని అధికంగా వేధిస్తున్న ప్రశ్న కూడా ఇదే. ప్రస్తుతం ఆ పార్టీనుంచి అరడజన్ కంటే ఎక్కువ మందే సి‌ఎం రేస్ లో ఉన్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

ఆ తరువాత భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇంకా ఈ లిస్ట్ లో పొన్నం ప్రభాకర్, సీతక్క, జగ్గారెడ్డి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే హస్తం పార్టీలో సి‌ఎం పదవిపై తీవ్రమైన పోటీ ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ హస్తంపార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తే సి‌ఎం పదవిపై నెలకొన్న కన్ఫ్యూజన్ తొలగించడం అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఆ పార్టీలో ఉన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా ఎవరిని సి‌ఎం చేసిన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఫలితాలు రాకుండానే సంబరాలకు రెడీ అయిన హస్తం నేతలకు.. డిసెంబర్ 3వ వెలువడే రిజల్ట్స్ షాక్ ఇస్తాయా ? లేదా ఎగ్జిట్ పోల్సే నిజమవుతాయా ? అనేది చూడాలి.

Also Read:Ind Vs Aus T20:టీమిండియా రికార్డ్.. సిరీస్ సొంతం!

- Advertisement -