భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా సొంతం చేసుకుంది. నిన్న జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా 20 పరుగుల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్ టీమిండియా కైవసం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (37), జైస్వాల్ (37), రింకూ సింగ్ (46), జితేష్ శర్మ (35).. పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసి ఓటమి మూటగట్టుకుంది..
ఇక డిసెంబర్ 3 న జరిగే ఐదో టీ20 మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది. ఈ సిరీస్ సొంతం చేసుకోవడంతో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20లలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. 213 మ్యాచ్ లకు గాను 136 విజయాలతో భారత్ మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత 226 మ్యాచ్ లకు గాను 135 విజయాలు సాధించి పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇక న్యూజిలాండ్ ( 200 మ్యాచ్ లలో 102), ఆస్ట్రేలియా ( 181 మ్యాచ్ లలో 95 ), సౌతాఫ్రికా ( 171 మ్యాచ్ లలో 95 ) జట్లు ఉన్నాయి. ఇక ఈ సిరీస్ తరువాత టీమిండియా సౌతాఫ్రికా టూర్ వెళ్లాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.
Also Read:Prabhas:సలార్ ట్రైలర్

