సి‌ఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చేనా ?

52
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎంత దూకుడుగా వ్యవరిస్తున్న ఒక ప్రశ్న మాత్రం ఆ పార్టీని తరచూ వేదిస్తూనే ఉంది. అదే సి‌ఎం అభ్యర్థి ఎవరనే విషయం. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికి కాంగ్రెస్ లో సి‌ఎం అభ్యర్థి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో సి‌ఎం అభ్యర్థిగా నిలబడేందుకు దాదాపు అరడజన్ మంది పోటీ పడుతున్నారు. అందులోంచి ఎవరు సి‌ఎం అభ్యర్థిగా నిలిచిన మిగిలిన వారినుంచి వ్యతిరేకత ఎదుర్కొక తప్పదు. ప్రస్తుతం టిపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క.. ఇలా ఆయా నేతలు సి‌ఎం అభ్యర్థిగా నిలబడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు..

అయితే సి‌ఎం అభ్యర్థి విషయం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నప్పటికి అసంతృప్త జ్వాలలు మాత్రం పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుంచి కూడా టీపీసీసీ పదవి విషయంలో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారు.. ఈ నేపథ్యంలో సి‌ఎం అభ్యర్థిగా మళ్ళీ రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపితే ఆయా నేతల నుంచి పార్టీలో చీలిక ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

అందుకే హైకమాండ్ కూడా సి‌ఎం అభ్యర్థి విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంచితే ఆ మద్య జరిగిన తానా సభల్లో సీతక్కను సి‌ఎం అభ్యర్థిగా చేసిన ఆశ్చర్యం లేదని రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరగకుండా ఉండాలంటే సీతక్కను సి‌ఎం అభ్యర్థిగా నిలబెట్టిన ఆశ్చర్యం లేదు. మరి ఈ ప్రతిపాదనకు సీనియర్ నేతలు ఎంతమంది సమ్మతిస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. ఇక వచ్చే నెల మొదటి వారంలో లేదా రెండో వారంలో బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను హస్తం పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ సదర్భంలో తొలి జాబితా అభ్యర్థులతో పాటు సి‌ఎం అభ్యర్థి ఎవరనేది కూడా ప్రకటిస్తారేమో చూడాలి.

Also Read:అమిత్ షా శకుని వ్యూహలు..ఫలించట్లేదా?

- Advertisement -