మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ ల మధ్య ఏదో గొడవ జరిగిందనే వార్త వీడియోతో సహా బయటికి రావడంతో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ లోనూ ఇదే హాట్ టాపిక్ అయ్యింది. మోహన్ బాబు సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న సారథి అనే వ్యక్తి మీద విష్ణు దురుసుగా వెళ్లే ప్రయత్నాన్ని మనోజ్ సెల్ ఫోన్ లో షూట్ చేసి ఉదయం ఇన్స్ టాలో పెట్టారు. కానీ అది చేయబోయే నష్టాన్ని ముందుగా గుర్తించలేదు. గ్రహించేసరికి అది కాస్తా డౌన్లోడ్ రూపంలో అందరి ఫోన్లకు, ల్యాప్ టాప్ లకు చేరిపోయింది. దీంతో వ్యవహారం రచ్చకెక్కింది.
అక్కడ ఏం జరిగిందనే విషయం గురించి ఎవరి దగ్గర వివరాలు లేవు. ఇటీవలే మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న సందర్భంలో ఆ వేడుకకు విష్ణు వచ్చాడు. అంతా తానై కలివిడిగా లేడు కానీ తమ్ముడి సమక్షంలో కనిపించాడు. మరోవైపు మనోజ్ భార్యతో పాటు కొద్దిరోజుల క్రితమే మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లి అక్కడి విద్యార్థులను కలిసి అక్కడో ఈవెంట్ లో పాల్గొని నాలుగు మాటలు చెప్పాడు. ఈ పరిణామాలన్నీ క్రోడీకరించి చూస్తే ఏదో ఆస్తులకు సంబంధించిన వ్యవహారమో లేదా మరొకటో అయ్యుంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి
వీలైనంత త్వరగా దీని గురించి తండ్రి కొడుకుల్లో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వడం మంచిది. లేదంటే ఈ వీడియో ఇలాగే చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మరోవైపు న్యూస్ ఛానల్స్ ఈ టాపిక్ మీద స్పెషల్ కవరేజ్ మొదలుపెట్టాయి. అసలేం జరిగిందనే దాని మీద ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కథనాలు వండేస్తున్నారు. కొందరు ఏదో సినిమా ప్రచారమని కూడా అనుకుంటున్నారు. టాలీవుడ్ రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్న మనోజ్ కు జరుగుతున్నది ఇబ్బంది కలిగించేదే. మరోవైపు విష్ణునే ఈ ఇష్యూలో హైలైట్ అవుతున్నాడు కాబట్టి వివరణ తనవైపు నుంచి వస్తేనే బెటర్.
ఇవి కూడా చదవండి..