బిగ్ బాస్ 4..అత్యధిక పారితోషికం ఎవరికో తెలుసా!

169
nagarjuna

తెలుగులో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్‌. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షో విజయవంతంగా నాలుగు ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది.16 మంది కంటెస్టెంట్లు మోనాల్ గజ్జర్ , సూర్య కిరణ్‌ దర్శకుడు , యాంకర్ లాస్య, హీరో అభిజిత్ ,సుజాత,దిల్ సే మహబూబ్,దేవి నాగవల్లి ,దేత్తడి హారిక, సయ్యద్ సోహెల్, హరియానా,అమ్మ రాజశేఖర్, కరాటే కల్యాణి, నోయల్ , దివి,అఖిల్‌, గంగవ్వ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

దీంతో ఇంటి సభ్యుల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తికనబర్చారు. ముఖ్యంగా ఈసారి బిగ్ హౌస్‌లో ఎక్కువ పారితోషికం తీసుకుంది ఎవరోనన్న దానిగురించి సెర్చ్ చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యాంకర్ లాస్య అత్యధిక పారితోషికం తీసుకుందట. రోజుకు లక్ష రూపాయల చొప్పున లాస్యకు ఇచ్చేందుకు నిర్వాహకులు ఒప్పుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.

సినీ, టీవీ షో లతో పాపులర్ అయిన లాస్యది వైఎస్ఆర్ జిల్లా, వీరబల్లి మండలం గడికోట గ్రామం స్వస్థలం. ఆమె తండ్రి పేరు వీరబల్లి నరసింహారెడ్డి. జెమిని టీవీలో అంకితం లైవ్ షో ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన లాస్య.. ఆ తరువాత మా టీవీ లో చేసిన సమ్‌థింగ్‌ స్పెషల్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది.