- Advertisement -
కరోనా ట్రీట్‌మెంట్‌లో రెమిడెసివర్ ఇంజక్షన్ వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని…. రెమ్‌డెసివర్ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది. అందుకేకరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం కరోనా సోకిన వారికి అందిస్తున్న ముఖ్యమైన మెడిసిన్ రెమిడెసివర్ ఇంజెక్షన్. కానీ కరోనా పేషెంట్లపై రెమిడెసివర్ ప్రభావం చూపుతున్నట్లుగాకనిపించడం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటికే కరోనా సోకిన తొలి రోజుల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్లాస్మా చికిత్సకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే.దీని ద్వారా ప్రయోజనం లేదని ప్లాస్మా థెరపీని తొలగిస్తూ ఐసీఎంఆర్ ఇటీవల తాజా మార్గదర్శకాలు విడుదల చేయడం తెలిసిందే.
- Advertisement -