పెద్దమనసు చాటుకున్న దర్శకుడు సుకుమార్..

47
sukumar

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ తమవంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా దర్శకుడు సుకుమార్ ముందుకొచ్చారు.

25 లక్షల రూపాయలతో కోనసీమ ఏరియలోని కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందించనున్నారు. ఇప్పటికే ఆజాద్ ఫౌండేషన్ ద్వారా కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన సుకుమార్…మరింతమందికి సాయం అందించేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.