8 రాష్ట్రాల్లో లక్ష యాక్టివ్ కేసులు!

37
covid

దేశంలో కరోనా సెకండ్ వేవ్ దాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతుండగా దేశంలో ఎనిమిది రాష్ట్రాలలో ఇప్పుడు 1 లక్షకు పైగా యాక్టివ్ కరోనా వైరస్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని..కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో 5,58,911 కేసులు ఉండగా, మహారాష్ట్రలో 4,04,229 కేసులు ఉన్నాయి.

9 రాష్ట్రాల్లో 50,000-1లక్ష మధ్యలో యాక్టివ్ కేసులు ఉన్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. 19 రాష్ట్రాల్లో 50,000కన్నా తక్కువ యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు. 22 రాష్ట్రాల్లో 15% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందన్నారు. 7 రాష్ట్రాల్లో 25శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందన్నారు.