భార‌త్‌లో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం…

70
who

భారత్‌లో కరోనా పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భార‌త్‌లో అనేక రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు ఆందోళ‌న‌కర స్ధాయిలో పెరుగుతున్నాయని…మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ గెబ్రియేసిస్ వెల్లడించారు.

భార‌త్‌లో వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్ ఉదృతిని అడ్డుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స‌హ‌క‌రిస్తోంద‌ని…ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో ఆక్సిజ‌న్ కాన్‌సెంట్రేట‌ర్స్‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలిపారు. మ‌హ‌మ్మారి సోకిన తొలి ఏడాది క‌న్నా.. రెండ‌వ ఏడాది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంద‌ని, మ‌ర‌ణాలు ఎక్కువ సంఖ్య‌లో న‌మోదు అయ్యే అవ‌కాశాలు ప్రపంచ దేశాలను ఆయన హెచ్చరించారు. భారత్‌కు స‌పోర్ట్ ఇస్తున్న అన్ని దేశాల‌కు ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు.