ఇండియా ఫస్ట్ విధానం ఏమైంది: కాంగ్రెస్

49
corona

కరోనా కట్టడిలో వైఫల్యం చెందిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ,ఎన్డీఏ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్…కరోనాకు వ్యతిరేకంగా టీకాలు వేయడంలో ‘ఇండియా ఫస్ట్‌’ విధానాన్ని ఎందుకు అవలంభించలేదని ప్రశ్నించారు.

దేశ పౌరులు మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఆరు కోట్ల వ్యాక్సిన్‌ మోతాదులను ఇతర దేశాలకు ఎగుమతి చేశారని విమర్శించారు.ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రపంచదేశాల్లో భారతదేశం 77వ స్థానంలో ఉండడం విచారకమన్నారు.

దేశంలో కేవలం 10.08 శాతం మందికి మాత్రమే సింగిల్‌ డోస్‌ వేశారని, 2.8శాతం మందికే రెండు మోతాదు అందిందన్నారు. టీకా విషయంలో భారతీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్లమెంట్‌ స్థాయీ సంఘం అక్టోబర్‌లో చేసిన సిఫారసులను భారత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.