పాలు ఏ టైమ్ లో తాగితే మంచిదో తెలుసా?

16
- Advertisement -

అత్యంత బలవర్ధకమైన పదార్థాలలో పాలు ఎంతో ముఖ్యమైనవి. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాలు తాగితే ఎంతో మేలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. పాలలో ఎముకలను బలపరిచే కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇంకా ఫాస్ఫరస్, పొటాషియం, రైబోఫ్లావిన్, వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మందికి పాలు ఏ టైమ్ లో తాగాలి అనే దానిపై సరైన అవగాహన ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉంటారు. అయితే ఒక సమయాభావంతో పాలు సేవిస్తే శరీరానికి ఎంతో మేలని చెబుతున్నారు ఆహార నిపుణులు. ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం పాలు తాగే అలవాటు చేసుకోవాలి. ఉదయం పూట పాలు తాగడం వల్ల శరీరంలోని అన్నీ భాగాలకు పాలలోని పోషకాలు సవ్యంగా అందుతాయి.

మరి ముఖ్యంగా పడగడుపున సేవించడం ఎంతో మంచిది. పాలు తాగిన తర్వాత కొద్దిపాటి వ్యాయామం చేస్తే కండరాలు పుష్టిగా తయారవుతాయి. ఇక సాయంత్రం కూడా పాలు తాగితే శరీరం రిలాక్స్ మోడ్ లోకి వెలుతుంది. తద్వారా అలసట దూరమౌతుంది. కొంతమంది రాత్రి పడుకునే సమయంలో కూడా పాలు సేవిస్తూ ఉంటారు. ఇలా తాగడం కూడా మంచిదే. ఎందుకంటే సుఖమైన నిద్రను పాలు ప్రేరేపిస్తాయి. నిద్ర లేమితో బాధ పడే వారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ఒక గంట ముందు పాలు సేవిస్తే గాఢ నిద్ర పడుతుంది. కొంతమంది బోజనానికి ముందు పాలు సేవిస్తుంటారు. ఇలా తాగడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే పాలు బలమైన ఆహారం అయినందువల్ల భోజనం చేసే ముందు సేవిస్తే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో పాలు తాగడం ఎంతో మంచిది.

గమనిక ; ఈ సమాచారం మీ అవగాహన కొరకు మాత్రమే అందించడం జరిగింది. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నచో నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -