రేవంత్ అక్కడ పర్యటించట్లే.. ఎందుకో?

48
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చేపవాల్సిన అవసరం లేదు. పార్టీని గాడిలో పెట్టేందుకు హైకమాండ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఫలితమలు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాడి తప్పడానికి ప్రధాన కారణం టీపీసీసీ చీఫ్ రెడ్డి మరియు సీనియర్స్ మద్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆదిపత్య పోరే. పార్టీని ఎన్నో ఏళ్లుగా అంటిపెట్టుకున్న వారిని కాదని అపుడే పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో.. ఒక్కసారిగా పార్టీలో సీన్ మారిపోయింది. రేవంత్ తీసుకునే నిర్ణయాలను సీనియర్స్ తప్పుబట్టడం, పార్టీ కార్యకలాపాలు సీనియర్స్ తో సంబంధం లేకుండా రేవంత్ స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఎన్నో పరిణామాలతో సీనియర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి మద్య రాజకీయ రగడ తారస్థాయికి చేరింది.

ఆ మద్య రేవంత్ ను టీపీసీసీ పదవి నుంచి సీనియర్స్ అంతా ఏకమై ఆదిష్టానానికి వ్యవహారం ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అద్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని మార్చేందుకు పార్టీ హైకమాండ్ సుముఖత చూపలేదు. ఇక ఆ తరువాత ఇవన్నీ పక్కన పెట్టేసి పార్టీని బలపరిచేందుకు రేవంత్ రెడ్డి పాదయత్ర చేస్తున్నప్పటికి.. దీనికి కూడా సీనియర్స్ నుంచి సరైన సహకారం అందడం లేదనే టాక్ నడుస్తోంది. ఇంతవరకు రేవంత్ పాదయాత్రలో సీనియర్స్ పెద్దగా కనిపించలేదు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే రేవంత్ మాదిరిగానే అదే పార్టీకి చెందిన బట్టి విక్రమార్క, పల్లె రామేశ్వర్ రెడ్డి వంటి వాళ్ళు చేపట్టిన పాదయాత్రకు మాత్రం భారీగా మద్దతు పలికారు సీనియర్స్. ఇక పోతే రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇప్పటికే ఆయా జిల్లాలో పూర్తి చేసుకుంది. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తారా లేదా ? అనేది ప్రశ్నార్థకమే.

ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వంటి వాళ్ళు ఈ జిల్లాకు చెందిన వల్లే.. జిల్లాలోని రెండు ఏపీ స్థానాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దాంతో వీరి సహకారం లేకుండా నల్గొండ జిల్లాలో రేవంత్ పాదయాత్ర చేపడితే.. అది పార్టీకి మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వీరు పాదయాత్రలో పాల్గొంటే సరేసరి. ఒకవేళ పాదయాత్రలో పాల్గొనకపోతే సీనియర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి వివాదం మరోసారి చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. అందువల్లే రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేపట్టే అవకాశాలు చాలా తక్కువ అనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఎన్నికలకు పట్టుమని ఆరునెలలు కూడా సమయం లేకపోగా.. పార్టీలో ఇంకా ఈ ఆదిపత్య పోరు కొనసాగుతుండడం కాంగ్రెస్ ను కలవర పెట్టె అంశమే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -