మారుతున్న సాంకేతిక యుగంలో డబ్బే పరమావధిగా మారడంతో ప్రజల జీవనం, మానవ సంబంధాలు యాంత్రికంగా మారాయి. పుట్టుక, చావు ఏదైనా లైట్ తీసుకునే రోజులు వచ్చాయి. చెప్పేవారు లేరు, చెప్పినా వినేవారు లేరు. అందుకే సమాజం అంతా వింత పొకడలతో నడుస్తోంది. ఆనాటి కాలంలో మన తాత,ముత్తాతలు ఆచరించిన విధానాలు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.
ఆనాటి కాలంలో ఉదయాన్నే లేచేవారు. ఆ సమయంలో వీచేగాలి అమృతతుల్యమైనది. రక్తాన్ని శుద్దిచేసి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఇక పూర్వం గడపలకు పసుపు రాసేవారు ఇది యాంటి బయోటిక్‌గా పనిచేసి సూక్ష్మజీవులు ఇంటిలోపలికి ప్రవేశించకుండా పేది. అలాగే ఇప్పుడు వస్తున్న రకరకాల క్రీంలకు బదులు ఆడవారు ఒంటికి పసుపురాసుకునే వారు దాని వలన చర్మవ్యాధులు రాకపోవడమే కాక చర్మం సౌందర్యంగా కనిపించేది.
ఇక పెద్దలకు మహారాజశ్రీ అనే పదం వాడేవారు..స్త్రీలకు పెద్దవాళ్ళైతే లక్ష్మి సమానురాలగు పదాలు వాడేవారు. విధవలకు *”గంగాభాగీరథీ సమానురాలగు”* అనే పదాలు వాడేవారు కానీ ఇప్పుడు ఈ పదాలు ఎక్కడా వినపడవు. ఇక ఆ రోజుల్లో సమాచారం చేరవేసేందుకు పోస్టుకార్డులు ఎక్కువగా వాడేవారు.ఉత్తరం యొక్క శరీర భాగంలో ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబ సమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంభోదించుకొంటూ, పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు దీవెనలతో ముగిస్తుండేవారు కానీ ఇవి ఇప్పుడు కనుమరుగైపోయాయి.
ఇక ఆనాటి ఉత్తరాల్లో ప్రేమ, పెద్దరికం, చక్కని బాంధవ్యాలు కనిపించేవి…వివాహాలు, అమ్మాయిల వోణీ ధారణ లాంటి శుభ సమాచారాలుంటే ఉత్తరానికి నలుమూలల పసుపు రాసి పంపిస్తుండేవారు. చావులాంటి అశుభ వార్తలుంటే సిరా ఉత్తరానికి నలుమూలల రాసి పంపిస్తుండేవారు. అలాంటి ఉత్తరాలు వస్తే చదివి బయటే చించి పడేస్తుండేవారు. మామూలు ఉత్తరాలను ఒక తీగెకు గుచ్చి పదిలంగా ఉంచుతుండేవారు. నేడు ఉత్తరాల సాంప్రదాయం పోయింది. భాషలో సంస్కారహీనత, పెద్దలంటే నిర్లక్షత, గౌరవ రహితం. ఇక మొబైల్ ఫోన్స్ రావడంతో ఇప్పుడు ఇంటికి వచ్చి పెళ్లి కార్డులు ఇచ్చేవారు కరువయ్యే పరిస్థితి వచ్చింది. మొబైల్‌లో పెళ్లికార్డు పంపించి రమ్మనే పరిస్థితి వచ్చింది. ఇక ముఖ్యంగా నమస్కరించే సంస్కారం పోయింది. అందుకే ప్రపంచం మళ్లీ మారాలంటే మంచిని ఆచరించే పరిస్థితి రావాలి..
ఇవి కూడా చదవండి..