రవితేజ ఆ కోరిక తీర్చుకుంటాడట

224
- Advertisement -

హీరో రవితేజ వ్యవహారం పక్కా మాస్ లాగే ఉంటుంది. ముఖ్యంగా రవితేజ కు ఆవేశం వచ్చినా ఆలోచన వచ్చినా ఆపలేం. ప్రస్తుతం రవితేజ కు డైరెక్షన్ పై అలోచన మళ్లింది. నిజానికి రవితేజ సినీ కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైంది. కొన్ని సినిమాలకు రవితేజ దర్శకత్వ శాఖలో పని చేశాడు కూడా. అందుకే, తన డైరెక్షన్ గురించి ఇప్పటికే చాలా సార్లు రవితేజ స్పందించాడు. దాంతో చాలాసార్లు రవితేజ డైరెక్ట్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ, రవితేజ డైరెక్షన్ లో వచ్చే సినిమాకు ఇప్పటివరకు పునాదులు పడలేదు.

కారణం.. రవితేజ హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. పైగా రవితేజకి హీరోగా ఇంకా సాలిడ్ మార్కెట్ ఉంది. కానీ రవితేజ మాత్రం తన డైరెక్షన్ గురించి ముచ్చట పెట్టకుండా ఉండలేకపోతున్నాడు. సమయం లేకపోయినా సందర్భం కాకపోయినా.. ఏదో ఒక రోజు నేను కూడా ఓ సినిమా డైరెక్ట్ చేస్తాను అంటూ రవితేజ స్వయంగా గర్జన చేస్తున్నాడు. నిజమే రవితేజ సినీ కెరీర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు కావొచ్చు. అందుకే, డైరెక్షన్ అంటే రవితేజ కు అమితమైన అభిమానం ఉండొచ్చు. పైగా ఒక స్టార్ హీరో స్వంతంగా ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తే.. ఆ సినిమాకి మంచి బజ్ రావొచ్చు. అందుకే రవితేజ కు డైరెక్షన్ అంటే మోజు.

పైగా ఇప్పటికే మాస్ మహా రాజా ఒక కథను కూడా రాసుకున్నాడట. తన ఇడియట్ సినిమాకి సీక్వెల్ అట ఆ సినిమా. అంటే.. ఇడియట్ 2 చేయాలని రవితేజ మనసులో ఎప్పటి నుంచో ఉంది అన్నమాట. ఐతే, అది సాధ్యమేనా?, పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా అది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఎలా ఉండాలి ?, ఎంత గొప్పగా ఉండాలి ?, రవితేజ ఏదో నాలుగు లైన్ల రూపంలో కథ అనేసుకుని సినిమా చేస్తా అంటే.. అనుకుంటే.. అది మరో హిట్ సినిమా ఎలా అవుతుంది. అసలు ఇడియట్ 2 తీసి మెప్పించడం అంత ఈజీ కాదు. పైగా మొదటి సినిమాతోనే అంత పక్కా కమర్షియల్ సినిమాను మోయడం కూడా కష్టమైన విషయమే. కష్టం అయితే కావొచ్చు. తన డైరెక్షన్ కోరికను, రవితేజ ఏదో ఒక రోజు తీర్చుకునేలానే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -