ఒకే సారి 32 మందితో వీడియో కాల్‌!

344
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ అదిరే ఫీచర్స్‌తో ముందుకురాబోతుంది.

వాట్సాప్ గ్రూప్‌లో ప్రస్తుతం 512 మంది పరిమితం. ఇకనుంచి గ్రూపులో 1024 మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు వీలుంటుందని కంపెనీ ప్రకటించింది. కమ్యూనిటీల్లో సభ్యులను 5వేల మందికి పెంచుకోవచ్చని తెలిపింది.

ఇకనుంచి ఓ వినియోగదారుడు వాయిస్, వీడియోకాల్స్ ఒకేసారి 32మందితో అనుసంధానం కావచ్చు. అంతేకాదు 2జీబీ సామర్థ్యం కలిగిన ఫైళ్లనుకూడా పంపే వెసులుబాటు ఉంటుంది. గతంలో 16ఎంబీ ఫైళ్లను మాత్రమే పంపించుకొనే వెసులుబాటు ఉండేది.గ్రూపులు తిరిగి సబ్ గ్రూపులను, మల్టీఫుల్ థ్రెడ్స్, ఎనౌన్స్ మెంట్ ఛానళ్లు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -